Header Banner

RuPay Vs VISA కార్డు మధ్య తేడా ఏమిటి? రెండిటిలో ఏది ఉత్తమం..

  Thu May 22, 2025 10:21        Business

నగదు లావాదేవీలతో పోలిస్తే నగదు రహిత లావాదేవీలకు ప్రజాదరణ పెరుగుతోంది. కార్డ్ చెల్లింపులు కూడా ఈ మార్పులో భాగమే. కార్డుల ద్వారా పలు రకాల నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు. కానీ కొత్త కార్డును ఎంపిక చేసే సమయంలో చాలామంది RuPay, Visa మధ్య తికమకలో పడతారు. ఈ రెండు కార్డుల మధ్య ఉన్న తేడా మీకు ముందుగానే తెలుసుండటం అవసరం. అలాగే, ఈ రెండింటిలో ఏదేమీ ఉత్తమమో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై చర్చిద్దాం. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు దసరా బంపర్ ఆఫర్! మంత్రి కీలక ప్రకటన! 

 

RuPay అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ద్వారా ప్రారంభించబడిన బహుళ దేశీయ ఆర్థిక సేవల, చెల్లింపు పరిష్కార వ్యవస్థ. ఇది భారతదేశానికి చెందిన స్వదేశీ పేమెంట్ ప్లాట్‌ఫారమ్, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. దీని లక్ష్యం Multilateral చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఆర్థిక చేర్పును ప్రోత్సహించడమే. ఈ కార్డ్ డెబిట్, ప్రీపెయిడ్, క్రెడిట్ కార్డుల విస్తృత శ్రేణిని తక్కువ లావాదేవీ ఖర్చులతో అందిస్తోంది. దీనివల్ల గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు ఇది మరింత అందుబాటులోకి వస్తోంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

VISA అనేది అమెరికాకు చెందిన బహుళజాతీయ పేమెంట్ గేట్‌వే, కార్డ్ పరిష్కార సంస్థ. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్ నెట్‌వర్క్‌లలో ఒకటి. Groww ప్రకారం, ఇది ప్రపంచవ్యాప్తంగా 14,500కి పైగా ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యంలో ఉంది. ఇది డెబిట్, ప్రీపెయిడ్, క్రెడిట్ కార్డులు, సహ-బ్రాండెడ్ కార్డులను అందిస్తోంది. 

 

RuPay కార్డ్ భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. కానీ అంతర్జాతీయ వెబ్‌సైట్లపై చెల్లింపులకు ఉపయోగపడదు. Visa కార్డ్ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇంతకుమించి వాడకం ఉంది. RuPay కార్డు ద్వారా చేసే లావాదేవీలన్నీ భారత్‌లోనే ప్రాసెస్ అవ్వడం వల్ల లావాదేవీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. Visa కార్డు అంతర్జాతీయ నెట్‌వర్క్ కావడం వల్ల లావాదేవీలు విదేశాల్లో ప్రాసెస్ అవుతాయి. అందువల్ల ప్రాసెసింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. RuPay లావాదేవీల వేగం Visaతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. Visa కార్డులో ఈ వేగం కొంత తక్కువగా ఉంటుంది.
RuPay లక్ష్యం ప్రధానంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాలు కాగా.. Visa కార్డులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో (టియర్ 1, టియర్ 2 నగరాల్లో) ప్రాచుర్యం పొందినవిగా ఉన్నాయి. 

 

ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..! 

 

ఈ రెండు కార్డుల తేడాలను గమనించిన తరువాత, మీ అవసరాలపై ఆధారపడి సరైన ఎంపిక చేసుకోవాలి. మీ లావాదేవీలు భారతదేశంలోని వాటికే పరిమితమైతే, RuPay ఉత్తమ ఎంపిక. దీనికి తక్కువ ఫీజు, వేగవంతమైన ప్రాసెసింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీరు విదేశీ ప్రయాణాలు చేసే వారు అయితే లేదా అంతర్జాతీయ లావాదేవీలు చేస్తుంటే, Visa కార్డ్ మీకు అనుకూలమైన ఎంపిక అవుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

    

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

  

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #CreditCards #DebitCards #RupayCard #VisaCard #MasterCard #ATMCards